బోధన్ ఎమ్మెల్యే నామినేషన్‌కు స్కూటీపై వెళ్లిన ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్యే కవిత స్కూటీ వీడియో
Published : Nov 9, 2023, 4:01 PM IST
MLC Kavitha Went On Scooty For Nomination :బోధన్ బీఅర్ఎస్ అభ్యర్థిగా షకీల్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కాసేపు స్కూటీపై కవిత ప్రయాణించి కార్యకర్తల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామినేషన్ అనంతరం కవిత మాట్లాడారు. బోధన్ నామినేషన్ ముందు నిర్వహించిన భారీ ర్యాలీ విజయయాత్రతో తప్పక గెలుస్తారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు అందరూ ఓటు వేయాలని.. దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టించారలని ప్రజలను కోరారు.
కాగా ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు రోడ్‌షోలు నిర్వహించి.. తమ నామినేషన్లు వేస్తుంటే మరికొందరు బ్యాండ్‌తో ప్రచారం చేస్తూ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కొందరు తమ అనచరుతో నామపత్రాలు పంపిస్తున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే ముందు కొందరు నేతలు పూజలు నిర్వహించి.. తమకు మద్దతుగా నిలిచే పార్టీ ముఖ్యనేతలను తమ వెంట తీసుకువస్తున్నారు.