తెలంగాణ

telangana

ETV Bharat / videos

MLC Kavitha Sings Bathukamma Song : బతుకమ్మ సంబురాల కోసం సింగర్​గా మారిన MLC కవిత.. ప్రోమో చూడండి - telangana latest news

🎬 Watch Now: Feature Video

MLC Kavitha Sings Bathukamma Song

By

Published : Aug 14, 2023, 3:51 PM IST

MLC Kavitha Sings Bathukamma Song :బతుకమ్మ సంబురాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో తర్వలో విడుదల కాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్​ మీడియాలో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గుడారి శ్రీనుతో కలిసి కవిత వీడియోలో కనిపించడం ఆందరిని ఆకట్టుకుంటోంది. 'తెలంగాణ జాగృతి యాప్​లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉండగా.. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. +91 8985699999 నెంబర్​కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని' కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని, తెలంగాణ జాగృతి ఆప్ ద్వారా షేర్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details