MLA Balka Suman Controversy : 'కాంగ్రెస్ వాళ్లు మనవాళ్లే.. వారినేం అనొద్దు.. మనమే వాళ్లను పంపించాం' - కాంగ్రెస్‌పై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Published : Aug 28, 2023, 12:40 PM IST
MLA Balka Suman Controversy : 'కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వాళ్లని మనవాళ్లు.. వాళ్లనేం అనొద్దు' అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పడం చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో సుమన్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్లో చేరలేదా అని గుర్తు చేశారు. 'మనమే మనవాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి పంపించాం' అని బాల్క సుమన్ చెప్పడం తీవ్ర దుమారం రేపింది.
MLA Balka Suman Controversial Comments on Congress :ఈ వ్యాఖ్యలపై చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ సభ్యుడు నూకల రమేశ్ మాట్లాడుతూ తమ పార్టీలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే బాల్క సుమన్ కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాల్క సుమన్ రాజకీయ చరిత్ర ఎలా మొదలైందో చూసుకోవాలని అన్నారు.. 'నీ మీద పోటీ చేస్తున్నాం.. ఆ పోటీ చేసే వ్యక్తిని నేనే' అని సవాల్ విసిరారు. దమ్ముంటే కోవర్టు ఎవరో చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
TAGGED:
MLA Balka Suman