తెలంగాణ

telangana

Minister Sridhar Babu on Development

ETV Bharat / videos

అధికారులు సమర్థవంతంగా పని చేసి లక్ష్యాలు సాధించాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు - Minister Sridhar about Peddapalli

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 9:18 PM IST

Minister Sridhar Babu on Development : అభివృద్ధి కోసం సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రణాళికబద్ధంగా లక్ష్యాలు సాధించాలని, ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలని ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో మంత్రి శ్రీధర్​ బాబు కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపణీ చేశారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్​ బాబు ప్రభుత్వ శాఖల వారీగా వివరాలను అడిగి తెలుసుకుని, వాటిని సమీక్షిస్తూ సాధించవలసిన ప్రగతిపై సూచనలు, సలహాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Minister Sridhar Babu on Free Bus : ప్రజా శ్రేయస్సు కోసం అన్ని విభాగాల్లో మార్పు రావాలని అధికారులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎంతమంది ప్రయాణం చేస్తారో, ఎన్ని బస్సులు ఆదనంగా కావాల్సి ఉంటుందనే విషయం తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.      

ABOUT THE AUTHOR

...view details