కోటి ఆశలతో ప్రజలు మా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నారు : మంత్రి పొంగులేటి - పాలేరులో పొంగులేటి
Published : Jan 3, 2024, 12:13 PM IST
Minister Ponguleti Praja Palana Applications : ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలతో ప్రజలు గ్రామసభలకు తండోప తండాలుగా తరలి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి కోసం అర్జీలు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తుల గడువు ఉందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Ponguleti Srinivas Reddy Comments On BRS : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా, సాకులు చూపి పథకాలను ఆపాలన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గులాబి పార్టీ నేతలు గ్యారంటీ పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదంటూ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని చూపిస్తామంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేట శ్రీనివాస్ రెడ్డితో ముఖాముఖి.