తెలంగాణ

telangana

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

ETV Bharat / videos

Asaduddin Owaisi: "మోదీ, అమిత్ షాలకు ముస్లింలు అంటే విద్వేషం ఎందుకు?" - Asaduddin Owaisi fire on bjp

By

Published : Apr 24, 2023, 5:26 PM IST

Majlis Party leader Asaduddin Owaisi reaction: ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాలకు ముస్లింలు అంటే ఎందుకు అంత విద్వేషమని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. చేవేళ్ల బహిరంగ సభలో అమిత్ షా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ప్రకటనను అసదుద్దీన్ ఖండించారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు అమలు కావడం లేదని.. ముస్లింలలో వెనుకబడిన వర్గాల ప్రాతిపదికన కోటాను వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. ఏయే కులాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి? ఎవరికి వర్తించవో స్పష్టంగా చెప్పాలన్నారు. అసెంబ్లీ ఆమోదించి పంపించిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లు బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

బీజేపీకు సంపూర్ణ ఆధిక్యం ఉన్నందున రిజర్వేషన్లకు 50శాతం పరిమితి ఎత్తివేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాల నుంచి వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, నర్సులు అవుతున్న వారిపై బీజేపీ నాయకులు అమిత్‌షా, మోదీలకు ఎందుకింత ద్వేషమని మండిపడ్డారు. బీజేపీ ఏదైతే మతపరంగా రిజర్వేషన్లు వస్తున్నాయని చెబుతున్నట్లుగా జరగట్లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details