Former MLA Teegala Special Interview : 'నా మంచి తనాన్ని వీక్‌గా అనుకోవద్దు.. మహేశ్వరం టికెట్ నాకే ఇవ్వాలి' - Former MLA Teegala Interview
Maheshwaram Ex MLA Teegala Krishna Reddy Interview : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా నాయకులు పార్టీలు మారుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వలసలు మొదలయ్యాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొత్త మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి హస్తం వైపు మొగ్గు చూపగా.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ గూటి వైపు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో రాజకీయ విభేదాలే ఇందుకు కారణమని సమాచారం. అయితే ఈ విషయంపై మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి.. పార్టీ వీడటంపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ తనకే కావాలంటోన్న ఆయన... సీనియర్లపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తే బాగుంటుందంటుందని సూచిస్తున్నారు. లేదంటే తనలాంటి వ్యక్తిని పార్టీ చేజార్చుకోవాల్సి వస్తుందంటున్న తీగల కృష్ణారెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి సతీశ్ ప్రత్యేక ముఖాముఖీ.