మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో- ఓటు అంతే ముఖ్యం
Published : Nov 23, 2023, 7:50 AM IST
Lets vote Awareness Programme in Hyderabad: మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కు కూడా అంతే అవసరమని లెట్స్ ఓట్ సంస్థ పిలుపునిస్తోంది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో యువత, ఐటీ ఉద్యోగులు తమ ఓటు హక్కు(USE of Vote)ను వినియోగించుకోవాలని వక్తలు కోరారు. అవినీతి రహిత పాలన కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నారు. దేశ దిశ, దశను ఓటు మాత్రమే మారుస్తుందని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Vote Awareness Programmes in Hyderabad : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో లెట్స్ ఓట్ సంస్థ(Lets vote organization) ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు పెడుతోంది. ఈ కార్యక్రమాలకు యువత ఆకర్షిస్తోందని నిర్వహకులు తెలిపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారందరూ.. తమ ఓటును వినియోగించేందుకు సుముఖత చూపుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు ఉపయోగించాలని ఓటర్లకు సూచిస్తోంది.