'ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు' - brs schemes in telangana
Published : Nov 7, 2023, 6:35 AM IST
BRS Candidate Koppula Eshwar Comments :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా తను చేసిన పనులతోనే ఓట్లు అభ్యర్థిస్తున్నాని ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ చేయని మంచి పనులు సీఎం కేసీఆర్ చేపట్టారని వివరించారు. ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మానవీయ కోణంలో ప్రజలకు ఆపదలో సేవాభావంతో తోడుగా ఉంటున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు పథకాలపై దుష్ప్రచారం చేసి అపోహలు పెంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
Welfare schemes in Telangana : కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మరెక్కడా లేవని కొప్పుల ఈశ్వర్ అన్నారు. తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. ప్రజలకు ఎల్లప్పడూ అందుబాటులో ఉన్నానని, వారికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఇతర పార్టీలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా అని ప్రశ్నించారు.