తెలంగాణ

telangana

ఖలిస్తానీల నిరసనకు వ్యతిరేకంగా భారతీయుల మువ్వెన్నెల జెండాల ప్రదర్శన

ETV Bharat / videos

భారతీయుల దెబ్బ అదుర్స్​.. ఖలిస్థానీల ర్యాలీ ఫెయిల్​! - భారత కాన్సులేట్‌ వద్ద ఖలీస్థాన్‌ జెండాల ప్రదర్శన

By

Published : Jul 9, 2023, 11:12 AM IST

Updated : Jul 9, 2023, 12:23 PM IST

భారత్​కు వ్యతిరేకంగా ఖలిస్థానీల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత వ్యతిరేక శక్తులకు చోటు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కెనడాలో ఖలిస్థానీ సంస్థ మద్దతుదారులు యథేచ్ఛగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. టొరంటోని భారత కాన్సులేట్‌ వద్ద.. ఖలిస్థానీ మద్దతుదారులు వారి జెండాలతో శనివారం ఆందోళన నిర్వహించారు. దీనికి కెనడాలోని భారతీయులు కూడా వారికి గట్టిగానే బదులిచ్చారు. మువ్వన్నెల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. భారత్​ మాతాకీ జై అంటూ పోటీగా నినాదాలు చేశారు. భారత కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగడం వల్ల కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.  కాగా జులై 8న ఖలిస్థానీ​ మద్దతుదారులు.. అమెరికా, బ్రిటన్​, అస్ట్రేలియా, కెనడాలో ర్యాలీకి పిలుపునివ్వగా.. దానికి అంతగా స్పందన రాలేదు. ఈ కార్యక్రమం పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలోని భారత దౌత్యకార్యాలయానికి భద్రతను పెంచారు అక్కడి అధికారులు. ఖలిస్థానీ మద్దతుదార్లు ఇక్కడ కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉందన్న సమాచారంతో ఈ చర్యలు తీసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని అధికారులు తెలిపారు. ఎంబసీ వద్ద భారత దౌత్యవేత్త తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు పరిస్థితిని పర్యవేక్షించారు.

ఖలిస్థానీ అనుకూలవాదులకు చోటివ్వడం భారత్‌తో ఆయా దేశాలకు మంచిదికాదని ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు గట్టిగానే సూచించారు. అయినా ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. భారత వ్యతిరేక శక్తులను అనుమతించబోమని కెనడా ప్రధాని ట్రుడో చెప్పినా.. ఆ మేరకు గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Last Updated : Jul 9, 2023, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details