Khairatabad Ganesh ready for Visit : ఖైరతాబాద్ మహాగణపతి 63 అడుగుల విగ్రహం సిద్ధం.. సందర్శనకు రెడీ.. - ఖైరతాబాద్ గణపతి ఎత్తు
Published : Sep 16, 2023, 10:23 PM IST
Khairatabad Ganesh ready for Visit : వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్‌లో మొదట గుర్తుకు వచ్చేది.. ఖైరతాబాద్ వినాయకుడు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల సందర్శనకు సిద్ధమయ్యాడు. విగ్రహాన్ని నిర్మించిన కళాకారులు, నిర్వాహకులు ముందుగా చెప్పినట్టుగానే పండగ రెండురోజులు ముందుగానే దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సంవత్సరం అక్కడ 63 అడుగుల ఎత్తున తయారు చేసిన విగ్రహానికి రంగులు వేయడం పూర్తయింది.
CM KCR Invite First day at Khairatabad Vinayaka Celebration : వినాయక చవితి(Vinayaka Festival) సందర్భంగా సోమవారం జరిగే పూజా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించామని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాల్లో భక్తులు చూసేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికి స్థానిక ప్రజలు అందరూ ఆసక్తిగా మహాగణపతిని చూసి ఆనంద పడుతున్నారు. సోమవారం వినాయక చవితి తొలి రోజు అయినందున ప్రముఖ వ్యక్తులు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని.. భద్రత విషయంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు.