తెలంగాణ

telangana

Face to Face With Station Ghanpur BRS Candidate Kadiyam Srihari

ETV Bharat / videos

నన్ను గెలిపిస్తే స్టేషన్ ఘన్​పూర్​లో స్పెషల్ మేనిఫెస్టో అమలు చేస్తా : కడియం శ్రీహరి - కడియం శ్రీహరితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:20 PM IST

Kadiyam Srihari Interview : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్​ అభ్యర్థి కడియం శ్రీహరి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఓ వైపు జనంలోకి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి తనను విమర్శించే నైతిక హక్కు లేదని కడియం మండిపడ్డారు. ప్రచారానికి వస్తున్న తనకు.. ప్రజలు హారతులు, భోనాలతో, బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. 

నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో కారు గుర్తుకే ఓటేస్తామని అంటున్నారని కడియం చెప్పారు. స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో కూర్చునే వారికి ఓటేస్తే నియోజకవర్గం ఆగమవుతుందని అన్నారు. స్టేషన్​ఘన్​పూర్​ అభివృద్ధి కోసం తాను సొంతంగా మేనిఫెస్టో తయారు చేశానని.. నియోజకవర్గం ప్రజలు తనని గెలిపిస్తే తప్పకుండా అవన్నీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే తననే ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details