JP Nadda Meets Ramoji Rao At RFC : రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిసిన జేపీ నడ్డా - రామోజీరావును కలిసిన బీజీపీ జాతీయాధ్యక్షుడు నడ్డా
Published : Oct 7, 2023, 8:25 AM IST
JP Nadda Meets Ramoji Rao At RFC Hyderabad :రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రోజున బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి నడ్డా హైదరాబాద్ వచ్చారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం సమయంలో ఆయన నగరంలోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
JP Nadda Ramoji Rao Meeting Hyderabad :అనంతరం దిల్లీ తిరిగి వెళ్లిన నడ్డా.. రామోజీ రావును కలిసిన విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా రామోజీతో దిగిన ఫొటోలను నడ్డా పంచుకున్నారు. రామోజీరావు దార్శనికుడని, మీడియా, సినిమా రంగాల్లో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నడ్డా వెంట కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్ కూడా ఉన్నారు. ఘట్కేసర్ సభ అనంతరం ఆయన రామోజీ రావును కలవడానికి వెళ్లారు.