తెలంగాణ

telangana

Jagadish Reddy fires on Congress Govrenment

ETV Bharat / videos

పాలన చేతకాక అప్పులు, అప్పులు అంటూ పాడిందే పాడుతున్నారు : జగదీశ్‌ రెడ్డి - బీఆర్ఎస్‌ జగదీశ్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 8:08 PM IST

Jagadish Reddy fires on Congress Govrenment :పథకాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తుంటే, అప్పులు అప్పులు అంటూ మంత్రులు పాడిందే పాడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆక్షేపించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలకు తాము సమాధానం చెప్పామని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం అవే అప్పుల గురించి చెబుతున్నారని అన్నారు. 

విద్యుత్ రంగంలో తాము సాధించిన ప్రగతిని ఇప్పటికే వివరించామన్న ఆయన అప్పు చేశామో, ఏం చేశామో ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేశామని గుర్తు చేశారు. పాలన చేత కాక కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారని, అప్పు తీర్చడం చేత కాకపోతే అప్పు తెచ్చిన సంస్థలకే విద్యుత్ సంస్థలను అప్పగిస్తే వారు నడుపుతారని సూచించారు. ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ నేతలు అబద్దాలతో బతుకు వెల్లదీస్తారని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క లేని సమస్యను పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, పదే పదే అప్పుల గురించి మాట్లాడటం మాని తన శాఖపై దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేత కాకపోతే ఆ విషయం చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎంగా లేని లోటును ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

...view details