తలుపులు తెరవకుండా అడ్డుకున్న మల్లారెడ్డి సన్నిహితులు..! - సంతోష్‌రెడ్డి రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తోంది. 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలోను ఐటీ తనిఖీలు చేపడుతున్నారు. అలాగే మంత్రి మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడైన.. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సంతోష్ రెడ్డి ఇంట్లోను ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఐటీ అధికారులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ డోర్లు వేసి ఉండడంతో మధ్యాహ్నం తలుపులను పగలగొట్టే ప్రయత్నం చేయడంతో సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తెరిచారు. ఆ తర్వాత అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST