తెలంగాణ

telangana

ISRO Launch Chandrayaan-3 Rocket

ETV Bharat / videos

Chandrayan3 Full Details : జాబిల్లిపై అన్వేషణకు దూసుకు వెళ్లిన చంద్రయాన్‌-3 - చంద్రయాన్3 పై చర్చా

By

Published : Jul 14, 2023, 9:46 PM IST

ISRO Launch Chandrayaan-3 Rocket :  భారతదేశ అంతరిక్ష రంగంలో మరో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. శ్రీహరికోటలోని షార్‌ 2వ ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన.. ఎల్​వీఎం-3 ఎం 4 బాహుబలి రాకెట్‌ తనకు అప్పగించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇకపై ఇస్రో అధగమించాల్సిన ఘట్టాలు ఏమిటి? ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జేట్​ కేటాయించింది?  విజయాలను అలవాటుగా మార్చుకున్న ఇస్రో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చేపడుతున్న ఈ ప్రయోగాల వల్ల దేశ, ప్రపంచ మానవాళికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రవాన్నే ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది? చంద్రుని పైకి వెళ్లేందుకు 40 రోజులు సమయం ఎందుకు పడుతుంది? అసలు ఎలాంటి ఫార్ములాను, సాంకేతికతలను ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు అమర్చారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details