MLA Etela Rajender Interview : "కిషన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయ్.. కలిసి పనిచేస్తాం" - telangana latest news
Interview with BJP MLA Etela Rajender : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర సారథిగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కట్టబెట్టింది. అధిష్టానం పదవి అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపిన ఈటల.. అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇద్దరం కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని.. కానీ ఈసారి అధికారంలోకి వచ్చేందుకు పార్టీ నాయకులందరం కలసి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినందున తమలో విశ్వాసం పెరిగిందని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లే గెలిచాయని.. కాంగ్రెస్ గెలవలేదని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌తో ముఖాముఖి.