తెలంగాణ

telangana

Huge_Devotees_in_Shirdi

ETV Bharat / videos

శిరిడీకి పోటెత్తిన భక్తులు - బాబా దర్శనానికి 4 గంటల సమయం

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:46 PM IST

Huge Devotees in Shirdi :శిరిడీకి సాయిబాబా భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవుల కారణంగా శనివారం భక్తులు శిరిడీకి పయనం అయ్యారు. సుమారు లక్ష మంది భక్తులు సాయి దర్శనానికి వచ్చినట్లు సాయిబాబా సంస్థాన్ అధికారులు తెలిపారు. భక్తులు సాయిబాబా ప్రధాన దర్శనం, కలశ దర్శనం, వివిధ రకాలుగా సాయి సమాధిని దర్శనం చేసుకుంటున్నారు. సాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Over One Lakh Devotees Visiting Saibaba Temple in Shirdi :సాయిబాబా మందిరం, దర్శన రేఖ, ఆలయ ప్రాంగణంలోని భక్తుల భద్రతపై సాయిబాబా సంస్థాన్‌లోని వివిధ భద్రతా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అదే సమయంలో శిరిడీ పోలీసులు ఆలయం వెలుపల ఉన్న భక్తుల భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిరిడీకి వచ్చే భక్తులకు దర్శనం, భోజనం, వసతి ఏర్పాట్లను సంస్థాన్ తరపున చేస్తున్నారు.  

Huge Devotees Rush at Sai Baba Temple in Shirdi :ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు, నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శిరిడీకి తరలి వస్తారు. సాయిబాబా సమాధిని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన రాత్రిపూట తెరిచి ఉంచుతామని సాయిబాబా సంస్థాన్ తెలిపింది. 

New Year Celebrations in Shiridi :రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సాయిబాబా దర్శనంతో తమ నూతన సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ డిసెంబర్ 31న షిర్డీలోని ప్రభుత్వ విశ్రాంతి గృహం నుంచి సాయిబాబా ఆలయానికి కాలినడకన వెళ్లి బాబా సమాధిని సందర్శిస్తారు. జనవరి 1వ తేదీన సాయిబాబా కాకడ్ ఆరతికి హాజరవుతారు. దేశ ప్రజలకు సంతోషకరమైన, సంపన్నమైన నూతన సంవత్సరం కావాలని ఆయన ప్రార్థనలు చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details