Hotel Setting Ganesh Idol : అకట్టుకుంటోన్న సెట్టింగ్.. కను'విందు' చేస్తోన్న గణేశుడు - హైదరాబాద్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలు 2023
Published : Sep 27, 2023, 7:26 PM IST
Hotel Setting Ganesh Idol : భాగ్యనగరంలో వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన గణనాథులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చంద్రయాన్ గణేశ్, రుద్రాక్ష గణేశ్, ట్రాఫిక్ పోలీస్ గణేశ్, ఇస్కాన్ టెంపుల్ గణేశ్ ఇలా వివిధ రూపాలలో భక్తులను కనువిందు చేస్తున్నాయి. తాము చేసే హోటల్ బిజినెస్‌ను తెలుపుతూ.. అబిడ్స్‌లోని సంతోష్ దాబా నిర్వాహకులు వేసిన హోటల్ సెట్టింగ్ వినాయకుడు చూపరులను విశేషంగా అకట్టుకుంటోంది.
Vinayaka Chavithi 2023 Variety Ganesh Idols :ఈ సెట్టింగ్‌లో వినాయకుని వాహనమైన మూషికాలు వంట చేస్తున్నట్లుగా ప్రతిమలను తీర్చిదిద్దారు. మూషికాలు చేసిన పదార్థాలను.. తల్లి పార్వతి దేవి ఏకదంతునికి తినిపిస్తున్నట్లుగా కొలువుదీర్చారు. రేపే నిమజ్జనానికి వేళ కావడంతో.. ఈరోజు పూజలు చేసి ప్రత్యేకంగా 56 రకాల స్వీట్లను గణనాథుడికి నైవేద్యంగా సమర్పించారు. తమది హోటల్ బిజినెస్ కావున.. తాము చేసే వృత్తిని తెలిపేందుకు ఈ సెట్టింగ్‌ను ఏర్పాటు చేసినట్లు యజమాని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక్కో రకం సెట్టింగ్‌తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.