తెలంగాణ

telangana

pooja

ETV Bharat / videos

Heroine Pooja Hegde : హనుమకొండలో బుట్టబొమ్మ సందడి... - సినీ తార పూజా హెగ్డే

By

Published : May 13, 2023, 3:15 PM IST

Heroine Pooja Hegde in hanumakonda : హనుమకొండలో ప్రముఖ సినీ తార పూజా హెగ్డే సందడి చేసింది. నగరంలోని ఒల్డ్‌ పొద్దుటూరి కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన ఒక షాపింగ్​ మాల్​ ప్రారంభించింది. అనంతరం మాల్‌లో కలియతిరుగుతూ పలు వస్త్రాలను పరిశీలించారు. చీరలు, డ్రెస్​లను ధరించి సందడి చేశారు. హీరోయిన్‌ని చూడడానికి అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అక్కడ పండగ వాతవరణం నెలకొంది.

 పూజా తన అందంతో, డాన్స్​తో ఎప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఆమెతో సెల్ఫీలు దిగడానికి జనం పోటీ పడ్డారు. చిన్నారులతో, యువతతో కలిసి బుట్టబొమ్మ ఫోటోలు దిగింది. చిన్న సినిమాలతో మొదలైనా పూజా కెరీర్​ తెలుగులో అగ్ర నాయకుల సరసన నటించింది. కాగా పూజా తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీస్ట్​ సినిమా స్టెప్​ వేసి అభిమానులను అలరించారు. కొన్ని స్టెప్పులు అభిమానులతో కలిసి వేశారు. వరంగల్‌కి రావడం చాలా ఆనందంగా ఉందని, మీ అభిమానం ఎల్లప్పుడు ఉండాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details