తెలంగాణ

telangana

Heavy Rain Fall in Manoharabad

ETV Bharat / videos

Heavy Rain Fall in Medak : మెదక్‌ జిల్లాలో కుండపోతగా వర్షాలు.. రోడ్లపైకి వరద నీరు

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 7:23 PM IST

Heavy Rain Fall in Medak : మెదక్‌ జిల్లావ్యాప్తంగా మనోహరాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో అత్యధిక వర్షపాతం నమోదైయింది.  ఇవాళ జిల్లాలో 137 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. అటుగా వెళ్తున్న వాహనాలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ చెరువు(Elamma Cheruvu) అలుగు ఉధృతంగా పారుతోంది.. దీంతో  చెరువు కట్టు, కాలువలు ధ్వంసం అయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లాలో పరిస్థితిని పరిశీలించి.. చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశించారు. 

Projects have Heavy Flow in Medak : జిల్లాలో కురుస్తున్న వర్షాలకి  ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్ట్‌ వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దీంతో రైతులు యాసంగి పంటలు కూడా పండుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి- మెదక్‌ జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్ట్‌, మెదక్‌ పట్టణంలో ఉన్న పసుపు లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.   

ABOUT THE AUTHOR

...view details