తెలంగాణ

telangana

Harithotsavam programme in Hyderabad

ETV Bharat / videos

Green Festival Programme in Telangana : 'పుడమి పులకించేలా.. ప్రకృతి ప‌ర‌వశించేలా హరితోత్సవ వేడుకలు' - Haritholsavam programme in june

By

Published : Jun 18, 2023, 12:47 PM IST

Green Festival Programme in Decade Celebrations 2023 : ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అన్ని వర్గాల ప్రజ‌ల భాగ‌స్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ద‌శాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా నిర్వహించనున్న హరితోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజ‌య‌వ‌ంతం చేయాల‌ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, ప‌ట్టణాల్లో పుడమి పులకించేలా.. ప్రకృతి ప‌ర‌వశించేలా.. పెద్ద ఎత్తున మొక్కలు నాటాల‌ని సూచించారు.

అదేవిధంగా అట‌వీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప‌చ్చద‌నం పెర‌గ‌డానికి విశేషంగా చేసిన కృషి, ఆ ఫ‌లితాల గురించి ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించున్న "హరితోత్సవం" కార్యక్రమంలో అడ‌వుల ప‌రిర‌క్షణ‌కు కృషి చేసిన అట‌వీ అధికారులు, సిబ్బందిని సన్మానించి, పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ద‌శాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమ‌వారం నిర్వహించనున్న హ‌రితోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కు ప్రాంగణంలో సీఎం మొక్కలు నాట‌నున్నార‌ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details