Harish Rao Inaugurates Ayush Centre at Nims : 'సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే 9 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తాం' - హైదరాబాద్ తాజా వార్తలు
Published : Aug 31, 2023, 4:57 PM IST
Harish Rao Inaugurates Ayush Centre at Nims : రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ విభాగం ప్రారంభించటం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఆయుర్వేదం, యోగా, యునానీ, హోమియోపతి సేవలు అందించనున్నారు. నూనెలతో మర్ధన, పాలు, మూలికలు కలిపి ఎముకల బలోపేతానికి చికిత్సలు, హైడ్రోథెరపీ, యోగా థెరపీ, ఆక్యుపంక్చర్ విధానాల్లో చికిత్సలు అందించనున్నారు.
ఇదిలా ఉండగా.. నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన మంత్రికి నర్సింగ్ సిబ్బంది రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో 50 పడకల ఆయుష్ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కళాశాలలను వచ్చే రెండు వారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, సీఎం ఓఎస్ డి.గంగాధర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.