తెలంగాణ

telangana

Gold Seized at Shamsabad Airport

ETV Bharat / videos

Gold Seized at Shamsabad Airport : వీళ్లు మాములు వాళ్లు కాదురా బాబోయ్​!.. బంగారాన్ని ఎలా తీసుకొచ్చారంటే..

By

Published : Jul 26, 2023, 8:19 PM IST

Gold Smugglers Arrested at Shamshabad Airport : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు కేసుల్లో దాదాపు కోటి 50లక్షల విలువైన 2 కిలోల 250 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో ప్రయాణికుల వద్ద జరిపిన తనిఖీల్లో ఈ గోల్డ్ దొరికింది. ఈ నెల 22వ తేదీన రెండు కేసుల్లో రూ.93.28 లక్షలు విలువైన 1.559 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు బ్యాగులోని వివిధ వస్తువుల్లో 240 గ్రాముల బంగారాన్ని దాచుకొని తెచ్చినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.21 లక్షల విలువ చేసే 328 గ్రాముల బంగారం, మరో ఇద్దరు ప్రయాణికుల నుంచి వేర్వేరుగా 474 గ్రాములు, 496 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన 704 గ్రాముల బంగారం లభ్యమైంది. మరో కేసులో రూ.7.56 లక్షలు విలువైన విదేశీ కరెన్సీ.. మరో ప్రయాణికుడి వద్ద రూ.2లక్షల విలువైన 15,000 విదేశీ సిగిరెట్లు పట్టుకున్నారు. ఈ ప్రయాణికులంతా కువైట్, దుబాయ్ నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికులు కస్టమ్స్ కళ్లు కప్పేందుకు బంగారాన్ని బియ్యం, పిండి, షాంప్​ డబ్బాలో తీసుకొచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details