'సీఎం గారూ.. ధైర్యముంటే నాపై పోటీ చేయండి!'
MP Navneet Rana dares Uddhav: మే 14న దిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ఉన్న ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామన్నారు మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణా. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టై ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఎంపీ.. ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో జరిగింది దురదృష్టకరమని, బ్రిటిషనర్ల నాటి సెక్షన్ 24ఏ ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం ఇంకా అమలులో ఉందంటే గత ప్రభుత్వాల అసమర్థతేనన్నారు. సుప్రీం కోర్టు ఆ చట్టం అమలుపై స్టే విధించటాన్ని స్వాగతించారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడు దేశాభివృద్ధి కోసమే పాటుపడతారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపుతారన్నారు. 'నా విషయంలో ఉద్ధవ్ ఠాక్రే దిగజారిపోయారు. నా స్వేచ్ఛను అణచివేశారు. చిల్లర రాజకీయాలు మాని నిర్మాణాత్మక పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నా. 50 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఒక ఎంపీతో పోరాటం చేస్తోంది. బాలసాహెబ్ ఠాక్రే ప్రజల కోసం పని చేశారు. అధికారం కోసం కాదు. దానికి విరుద్ధంగా ఉద్ధవ్ ఠాక్రే పని చేస్తున్నారు. ఆయనకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా నాపై పోటీ చేయాలి' అని సవాలు విసిరారు నవనీత్.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST