Prathidhwani కేంద్రం నిర్ణయంతో ఇకపై నెలనెలా కరెంటు షాకులు
ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు ఏడాదికి రెండు, మూడుసార్లు సవరించేవారు. కానీ ఇప్పుడు... ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. ఇకపై కరెంట్ ఛార్జీల పరిస్థితి అంతే. ఇప్పటివరకు ఏడాదికోసారి సవరిస్తున్న విద్యుత్ ఛార్జీలు... ఇకమీదట నెలకోసారి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కరెంట్ ఛార్జీల సరఫరా భారాన్ని ఆటోమేటిక్‌గా వినియోగదారుడిపై వేసేలా 90 రోజుల్లో ఓ ఫార్ములా రూపొందించాలని... విద్యుత్ కమిషన్‌కు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. ఈ ఫార్ములా ఖరారు చేసే వరకూ అమలు చేసేందుకు వీలుగా కొత్త నిబంధనలు జారీ చేసింది. కేంద్ర విద్యుత్‌శాఖ నిర్ణయంతో వినియోగదారులపై కరెంట్ ఛార్జీల భారం ఎంతమేర పడే అవకాశం ఉంది?, నెలకోసారి ధరలు సవరిస్తే సామాన్యులు పరిస్థితి ఏంటనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST