Pratidwani : హైదరాబాద్... వరద ముప్పు తప్పేదెలా? - హైదరాబాద్ జంటనగరాల ముంపు
Pratidwani : వర్షాకాలం ప్రారంభంతో పాటే హైదరాబాద్ జంటనగరాల ముంపు ప్రాంత వాసుల్లో భయమూ మొదలైంది. 2020 అక్టోబరులో భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన పీడకలలు ఇంకా అందరి కళ్ల ముందే మెదులుతూ ఉన్నాయి. మరోసారి అలాంటి సమస్య రానివ్వమని GHMC చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం... SNDP పనులు అర్థాంతరంగా ఆగిపోవడం, పనులు జరిగిన చోట్లా అరకొరగానే చేయడమే ఈ భయాలకు కారణం. కొత్తనాలాల నిర్మాణం అటుంచి పాత నాలాల్లో ఆక్రమణలు తొలగించపోవడంతో వందల కాలనీలు ముంపులో మునిగే ప్రమాదం ఏర్పడింది. పాత అనుభవాలు తలుచుకుంటేనే హైదరాబాదీ వాసుల్లో వణుకు మొదలవుతుంది. మళ్లీ అలాంటి పరిస్థితి ఈ ఏడాది కూడా తప్పదా అన్న భయం కనిపిస్తోంది. అధికారులు చేస్తున్న తూతూమంత్రపు ప్రయత్నాలతో ఎలాంటి ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎన్నాళ్లీ హైదరాబాదీల కష్టాలు. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరానికి వర్షాకాలం వస్తే చాలు ఈ కష్టం ఎందుకు? ఇకనైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.