Pratidwani : ఫీజుల బకాయిలు... ఆందోళనలు - ప్రతిధ్వని
Pratidwani : అటు ప్రభుత్వం.. ఇటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు.. వారిద్దరి మధ్య లక్షలాదిమంది విద్యార్థులు. రాష్ట్రంలో నడుస్తోన్న బోధన రుసుముల ఫీజుల రీయంబర్స్‌మెంట్... బకాయిల విషయంలో ప్రస్తుత పరిస్థితి ఇది. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాల దీనికి అదనం. సమస్య ఎంతోకాలంగా ఉన్నదే. కానీ ఇప్పుడు మరింతగా చర్చకు రావడానికి కారణం... కేజీ టూ పీజీ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన అల్టిమేటం. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది. మన విద్యా వ్యవస్థలో ఎప్పటినుంచో ఉన్న ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం లభించడం లేదు. విద్యారంగానికి కోట్లాది నిధులు ప్రకటించే ప్రభుత్వం ఆచరణకు వచ్చేసరికి ఎందుకిలా వెనకబడుతోంది. ప్రభుత్వ సాయంపైనే చదువుకునే ఎందరో పేద పిల్లలకు ఇంకెన్నాళ్లు ఈ అగచాట్లు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు చేయడంతో పాటు విద్యార్థులకు టీసీలు ఇచ్చేదిలేదంటున్న ఐక్య కార్యాచరణ సమితి తీరుతో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇరువ్యవస్థల మధ్యలో విద్యార్థుల భవితవ్యం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.