కష్టాల్లో ఐటీ ఉద్యోగాలు.. వెంటాడుతున్న భయాలు.. మార్గం ఏమైనా ఉందా! - తెలంగాణ తాజా వార్తలు
IT Employee Recruitment: ఒకపక్క మాంద్యం.. మరోపక్క గడ్డుపరిస్థితుల్లో ఐటీ కొలువులు. ఫలితంగానే బీటెక్ థర్డ్ ఇయర్‌లోనే ఆఫర్ లెటర్లు అందించే ఐటీ దిగ్గజ సంస్థలు ఆ దిశగా ఆసక్తే చూపడం లేదు. ఎక్కడ చూసినా వారి రిక్రూట్‌మెంట్‌ల సందడే కనిపించడం లేదు. కొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగులనూ తొలగించేస్తున్నాయి. మరికొన్ని వేతనాలు, ప్యాకేజీల్లో కోతలు వేస్తున్నాయి. ముందే ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థల్లోనూ అరకొర ట్రైనింగ్‌తో వెనక్కి పంపించేస్తుండడం, నియామకాలు వాయిదా వేయడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి యువ ఇంజినీర్లది. అసలు ఎంతకాలం ఈ పరిస్థితులు? కోతలకాలంలో యువత నేర్చుకోవాల్సిన మెళకువలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.