TS PRATHIDWANI: పునరావాసం స్థలాలపై కఠిన నిబంధనలెందుకు?
TS PRATHIDWANI: ప్రాజెక్టుల నిర్మాణాల కోసం భూములు కోల్పోతున్న వారిని చట్టాలకు సంబంధించిన నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే ప్రభుత్వం ఇచ్చే ధర చాలా తక్కువ ఉందని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లస్థలాలపై అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆంక్షల వల్ల తమకు కేవలం వారసత్వమైన హక్కులు వస్తున్నాయి తప్ప పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లేవని భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఈ వాస్తవానికి కారణలేంటి? ఎందుకు ఈ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఆంక్షలేంటి.. చట్టపరమైన నిబంధనలేంటి అనే అంశాలపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST