తెలంగాణ

telangana

ఈటల రాజేందర్

ETV Bharat / videos

Etela Rajender: రేవంత్​ సవాల్​పై స్పందించిన ఈటల.. ఏమన్నారంటే..? - తెలంగాణ పొలిటికల్ న్యూస్

By

Published : Apr 22, 2023, 8:07 PM IST

Etela on Revanth Challenge: వ్యక్తిగతంగా ఏ ఒక్కరినీ కించపరిచే విధానం తనది కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. నిన్న కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సవాల్‌పై స్పందించిన ఈటల.. తగిన సమయంలో అందరికీ సమాధానమిస్తానని వెల్లడించారు. తాను ఏం చేసినా ప్రజాహితం కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయో.. కేసీఆర్​ పాలన ఎలా ఉందో తెలియజేయాలనే అలా మాట్లాడానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ అవుతుందో ప్రజలందరికీ తెలిసేలా తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని ఈటల అన్నారు. అన్ని విషయాల పట్ల సంపూర్ణంగా స్పందిస్తానని చెప్పారు. ధర్మం, న్యాయం, ప్రజల కోసమే తాను మాట్లాడానని.. అంతే తప్ప ఏ ఒక్కరి కోసం మాట్లాడలేదని ఈటల స్పష్టం చేశారు. 

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేవంత్​రెడ్డి.. ఈ ఆరోపణలపై తేల్చుకునేందుకు నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని సవాల్​ విసిరారు. తాజాగా ఇదే సవాల్​పై ఈటల స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details