తెలంగాణ

telangana

Elephant dies after being entangled in power line

ETV Bharat / videos

కరెంట్​ షాక్​ తగిలి ఏనుగు మృతి.. లైవ్​ వీడియో వైరల్​! - ధర్మపురి జిల్లాలో ఏనుగు మృతి

By

Published : Mar 18, 2023, 5:58 PM IST

తమిళనాడులో ధర్మపురి జిల్లాలో మరో ఏనుగు ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​కు గురై మరణించింది. శనివారం ఉదయం ఓ ఏనుగు కంబినల్లూర్​ ప్రాంతంలో తన గుంపు నుంచి విడిపోయి కెలవల్లి గ్రామ సమీపానికి చేరుకుంది. ఆ ప్రాంతంలోని పంటపొల్లాలో సంచరిస్తూ.. ఆహారం కోసం వెతక సాగింది. నీటి కోసం ఓ సరస్సు వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న ఓ హై ఓల్టేజ్​ విద్యుత్ లైన్​కు​ తలిగింది. దీంతో ఒక్కసారిగా గజరాజు కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే కుప్పకూలింది. ఏనుగును గమనించిన స్థానికులు దాని వద్దకు చేరుకునే లోపే మృతి చెందింది. అయితే ఈ మొత్తం ఘటనను గ్రామస్థులు ఫోన్​లో చిత్రీకరించారు. దీంతో అది స్థానికంగా వైరల్​గా మారింది. సమాచారం అందుకొన్న అటవీ సిబ్బంది హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే జిల్లాలో ఇటీవలే మూడు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగు పిల్లలు మృత్యువు నుంచి తప్పించుకోగలిగాయి. వీటిని అటవీ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details