తెలంగాణ

telangana

బంగారం వెండి వజ్రాలతో వినాయకుడు

ETV Bharat / videos

Diamond and Gold Ganesh : బొజ్జ గణపయ్యకు వజ్రాల ఆభరణాల అలంకరణ.. చూస్తే రెండు కళ్లు చాలవంట! - సూరత్​లో బంగారం వజ్రాలం గణేశ్​

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 11:42 AM IST

Updated : Sep 24, 2023, 11:57 AM IST

Diamond and Gold Ganesh :గుజరాత్​లోని సూరత్​ జిల్లాలో ఓ వినూత్న గణేశుడ్ని ప్రతిష్ఠించారు నిర్వాహకులు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో వినాయకుడిని అలంకరించారు. మండపాన్ని సైతం అద్భుతంగా వెండితో డెకరేట్​ చేశారు. దీంతో ఈ వినూత్న గణపతిని చూసేందుకు భారీ ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. ఏకదంతుడిని దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. బంగారం, వెండి, వజ్రాలతో అలంకరించిన వినాయకుడిని చూసి సంబరపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాగే వినూత్న రీతిలో గణేశుడ్ని ప్రతిష్ఠిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయకుడ్ని, మండపాన్ని చాలా అద్భుతంగా అలంకరించారని భక్తులు చెబుతున్నారు.

Ganesh Chaturthi 2023 : వినాయక నవరాత్రులను దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో పూజలు అందుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో కొలువుదీరిన ఓ గణనాథుడికి రూ.360.40 కోట్ల బీమా చేయించారు. మరో వినాయకుడిని 500, 200, 100 రూపాయల కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గణనాథుల విశేషాలపై ప్రత్యేక కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Sep 24, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details