తెలంగాణ

telangana

Debate on Police System in Telangana

ETV Bharat / videos

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​కు వ్యవస్థ ప్రక్షాళన ఎలా? - పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 9:19 PM IST

Debate on Police System in Telangana :కొన్ని రోజులుగా తెలంగాణ పోలీస్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రోజుల వ్యవధిలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న క్రమశిక్షణ చర్యలు, చీటింగ్‌కేసులో ఏకంగా ఒక ఐపీఎస్‌ అధికారే అరెస్టు కావడం సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి అసలు కారణాలేంటి? రాబోయే ఆ మార్పు ఎలా ఉండాలి?

తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? సమాజంలోని నేరప్రవృత్తి కల వ్యక్తుల కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచుతారు. అదే పోలీస్‌ శాఖలోని నేరప్రవృత్తిగల అధికారులను ఎవరు గుర్తిస్తారు? పోలీసు వృత్తిలో కాఠిన్యంతో పాటు మానవత్వం మేళవిం చినప్పుడే ప్రజలకు జరగాల్సిన మేలు చేకూరుతుందన్నది చాలామంది సూచన. ఈ విషయంలో రాష్ట్రం ఎక్కడుంది? ఇంకా ఏం చేస్తే మేలు అని మీ సూచన? ఫ్రెండ్లీ, పారదర్శక, నిష్పాక్షిక పోలీసింగ్‌ దిశగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details