వరి పొలంలో 9 అడుగుల మొసలి.. చెట్టుపై ఎలుగుబంటి - Karnataka crocodile in crop land latest news
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో మొసలి హల్చల్ చేసింది. జిల్లాలోని హువినా హడగలి నగరంలోని తుంగభద్ర నదిలో నుంచి బయటకు వచ్చిన 9 అడుగల భారీ మొసలి రాజావాలా గ్రామంలోని ఓ వరి పొలంలోకి ప్రవేశించింది. ఇంత పొడవున్న మొసలిని చూసి గ్రామస్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. అటవీ శాఖ సిబ్బంది రైతలు సాయంతో మొసలిని తాడుతో బంధించి వాహనంలోకి ఎక్కించారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు.
మరోవైపు వెంకటాపురా గ్రామ శివారులో ఓ ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి వినయ్ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చాకచక్యంగా దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు. కాగా, ఎలుగుబంటి ఎక్కిన చెట్టుకు తేనె పట్టు ఉండటం వల్ల అది పైకి ఎక్కిందని గ్రామస్థులు చెబుతున్నారు.