నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న మహిళ.. ఒక్కసారిగా మొసలి దాడి చేసి.. నీటిలోకి లాక్కెళ్లి.. - నది ఒడ్డున ఉన్న మహిళపై మొసలి దాడి
Crocodile Attack On Woman : నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న ఓ మహిళపై మొసలి దాడి చేసి.. ఆమెను నోట కరిచి అమాంతం నీటిలోకి లాక్కెళ్లింది. దీంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరమైన ఘటన ఒడిశా జయపుర జిల్లాలో జరిగింది.
జ్యోత్స్న జీనా అనే మహిళ.. బుధవారం ఉదయం బట్టలు ఉతికేందుకు స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఒంటరిగా ఉన్న మహిళపై మొసలి అకస్మాత్తుగా దాడి చేసి.. నీటిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనలో మహిళ మరణించింది. అయితే ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలను నదికి అవతలి వైపునున్న వ్యక్తి వీడియో తీశాడు. దీంతో మహిళ కోసం స్థానికులు రెస్య్కూ నిర్వహించారు. కొద్దిసేపటికే శరీరంపై తీవ్రగాయాలతో మహిళ మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో మహిళ మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే జులై 28వ తేదీన ఇదే తరహా ఘటన మరొకటి జరిగింది. కేంద్రపరాలోని బ్రాహ్మణి నది వద్ద జరిగిన మొసలి దాడిలో అమూల్య దాస్ అనే మరో మహిళ మృతిచెందింది.