తెలంగాణ

telangana

Selfi Video Suicide Attempt in Jangaon District

ETV Bharat / videos

Couple Suicide Attempt Selfie Video : సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. - Suicides of farmers in Telangana

By

Published : Aug 13, 2023, 1:59 PM IST

Couple Suicide Attempt Selfie Video : కబ్జారాయుళ్ల కన్ను పడితే.. సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం. వారిని ఎదురించలేరు.. సకాలంలో న్యాయమూ జరగదు. సరిగ్గా ఇటువంటి ఘటనే జనగామ జిల్లాలో ఓ కుటుంబానికి ఎదురైంది. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. లైవ్​లో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్మెట్ట మండలం సూర్యబండ తండాకు చెందిన గురు, సునీత దంపతుల పట్టా భూమిని.. అదే గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ భూక్యా జయరాం నాయక్, శ్రీను, సురేందర్​తో పాటు అతని అనుచరులు కబ్జా చేసి చదును చేస్తున్నారని, ఎన్ని సార్లు అడ్డుకున్నా ఖాతరు చేయడం లేదని.. సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పనులు ఆపకుండా.. 258 సర్వే నంబర్​లో గల తన పట్టా భూమిని అక్రమించారని.. తమకు వారసత్వంగా సంక్రమించిన భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఎదురించలేక చనిపోతున్నామని.. చనిపోయిన తర్వాతైనా తమకు న్యాయం చేయాలని వీడియోలో వేడుకున్నారు. వీడియోను చూసిన బాధిత కుటుంబీకులు అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details