భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ కార్యకర్త కత్తితో హల్ చల్ - కాంగ్రెస్ కార్యకర్త హల్‌చల్ వీడియో వార్తలు
Published : Dec 4, 2023, 5:01 PM IST
Congress Activist HalChal With Knife Video Viral In Bhadradri Kothagudem :కత్తి పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త హల్‌చల్ చేసిన ఘటన జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జారే ఆదినారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కమలాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపు చేశారు.
Congress Activists Riots Against BRS Village Committee President :ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ కార్యకర్త గొగ్గిల నావికృష్ట అనే వ్యక్తి చేతిలో మాసం కోసే కత్తిని పట్టుకుని హల్‌చల్ చేసి అక్కడి వారిని భయాందోళనలకు గురిచేసాడు. స్థానిక బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు ఊరబెద్ది వెంకన్న దగ్గరకు వెళ్లి చంపుతానంటూ నావికృష్ణ బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నావి కృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.