ఉచిత కరెంట్‌పై జానారెడ్డి మాట తప్పారు - హాలియా సభలో కేసీఆర్ - కాంగ్రెస్ లీడర్ జాానారెడ్డిపై కేసీఆర్ ఫైర్
Published : Nov 14, 2023, 4:56 PM IST
CM KCR at Praja Ashirvada Sabha at Nagarjuna Sagar : స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అయినా ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అనుకున్నంత పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హాలియాలోని ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ వచ్చిన తర్వాత తాము తీసుకున్న మొదటి నిర్ణయం.. రైతు బాగుండాలని ఆలోచన చేశామని తెలిపారు. వారు బాగుండాలంటే భూమి, నీరు, ఉచిత కరెంటు ఇవ్వాలనుకున్నామని తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో నీటి తీరువ వసూలు చేసేవారు.. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తాము రద్దు చేశామని.. ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు.
ఓటరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని.. నియోజకవర్గం నుంచి నిలుచున్న అభ్యర్థి, వారు ఉన్న పార్టీల చరిత్ర, నడవడిక అన్ని పరిశీలించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 70వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్లలో ఉచిత కరెంటు ఇస్తే జానారెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకుంటానన్నారని తెలిపారు. కానీ ఇచ్చిన మాట జానారెడ్డి తప్పారని.. అందుకే ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.