మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య గొడవ - చేవెళ్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
Published : Dec 10, 2023, 5:33 PM IST
Clash Between Congress and BRS in Chevella Constituency : మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య, అధికార పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో జరిగిన ఉచిత బస్సు ప్రారంభానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షలు వంటి పథకాలను మెచ్చుకున్నారు. అలాగే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడుతుండగా అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది.
Congress vs BRS in Chevella : కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమ్ భరత్ వర్గీయులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే యాదయ్య వర్గీయుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో అధికార పార్టీ వారు ఆయన మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఈ గొడవలో పోలీసులు కలుగజేసుకొని ఇరు వర్గాలను సముదాయించారు.