తెలంగాణ

telangana

Chikoti Pravven

ETV Bharat / videos

Chikoti Praveen On joining BJP : బీజేపీలో చేర్చుకోకపోవడంపై చీకోటి ఫైర్.. ఏం చేయాలో నాకు తెలుసంటూ..! - క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌కు చుక్కెదురు

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 1:08 PM IST

Chikoti Praveen On joining BJP :బీజేపీలో తనను చేర్చుకోకపోవడంపై క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్(Chikoti Praveen) స్పందించారు. మంగళవారం రోజున బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు చూసి తమ అభిమానులు నిరుత్సాహపడ్డారని తెలిపారు. తనంటే భయం ఏంటో అర్థమైందని.. ఏ శక్తులు కలిసి పని చేసినా తనను ఏం చేయలేవని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న వాళ్లకు చీకోటి సవాల్ విసిరారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం తనకి రాదని.. 'మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా' అంటూ ధ్వజమెత్తారు. తనకు జరిగిన పరిణామాలు చూసి సంతోష పడుతున్న వాళ్లకు త్వరలోనే గదిలో కూర్చొని ఏడ్చే రోజు తీసుకొస్తానని హెచ్చరించారు.  

అసలేం జరిగిందంటే :భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరేందుకు సన్నద్ధమైన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌కు చుక్కెదురైంది. బీజేపీలో చేరడానికి పెద్దఎత్తున తన అనుచరులతో ర్యాలీగా బయల్దేరి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కానీ కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి.. చీకోటి రాకముందే పార్టీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు. భారీ హంగు ఆర్భాటంతో వచ్చిన చీకోటి అనుచరులు పడిగాపులు కాసి.. చివరికి ఆగ్రహంతో పార్టీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details