తెలంగాణ

telangana

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్- హైదరాబాద్​లో అభిమానుల సంబరాలు

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 7:35 PM IST

TDP Leaders Celebration at NTR Bhavan in Hyderabad

Chandrababu Followers Celebrations in Hyderabad : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయడంతో.. హైదరాబాద్​లోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ స్కిల్ డవలంప్​మెంట్​ కేసు(Skill Development Case)లో బెయిల్ వచ్చింది.. ఇది వరకే ఇదే కేసులో మధ్యంతర బెయిల్​ రావడంతో బయటకి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వచ్చారని.. ఆలస్యమైనా న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. 

TDP Leaders Celebration at NTR Bhavan: హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) వద్ద పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి హడావిడి చేశారు. అనంతరం ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తులకు స్వీట్లు పంచారు. చంద్రబాబుకు కార్తీకమాసంలో బెయిల్ రావడం శుభ పరిణామమని టీడీపీ(TDP) నాయకులు అభిప్రాయ పడ్డారు. ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని అన్నారు. బాబు కోసం ప్రపంచ వ్యాప్తంగా  అనేక మంది చేసిన ఆందోళనలు, నిరసనలు, ప్రార్ధనలు ఫలించాయని హర్షం వ్యక్తం చేశారు. 

TDP Followers Celebrations in Khammam : ఖమ్మం జిల్లాలోని కల్లూరులో కూడా టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం చాలా ఆనందంగా తెలిపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని.. ఇవాళ వెలువడిన ఏపీ హైకోర్టు నిర్ణయం శుభపరిణామని చెప్పారు. 

TAGGED:

ABOUT THE AUTHOR

...view details