Central team visit to bhadrachalam Flood Damage : భద్రాచలంలో కేంద్ర బృందం పర్యటన..వరద ప్రాంతాల పరిశీలన - telangana visit Central team
bhadrachalam On Flood Damage Survey On Central team: వర్షాలు, గోదావరి వరదలు వల్ల నష్టాలను తెలియచేస్తూ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర కమిటీ అధికారులు పరిశీలించారు. జిల్లాలోని ఏఏ ప్రాంతాల్లో రోడ్లు పాడయ్యాయి, ఎంతవరకు పంట నష్టం జరిగిందని వాటికి సంబందించిన ఫోటోలను ఎగ్జిబిషన్లో పెట్టారు. పశువులు, జీవాలు ఎన్ని మృతి చెందాయి, నివాస గృహాలకు ఎంతవరకు నష్టం జరిగింది అనే అంశాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర కమిటీ అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్. జి.వినీత్ ఫోటో ఎగ్జిబిషన్ వివరాలను కేంద్ర అధికార బృందానికి వివరించారు. అనంతరం బూర్గంపాడు మండలంలో జరిగిన రోడ్డు డ్యామేజీలను నేరుగా పరిశీలించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రదేశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జిల్లాకు ఎంత నష్టం జరిగిందనే ఒక నమూనాను తయారుచేసి కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు.