తెలంగాణ

telangana

Cars Stuck In Flood Water

ETV Bharat / videos

తగ్గిన యమునా ఉద్ధృతి.. వరద నీటిలోనే వందలాది కార్లు.. వీడియో చూశారా? - car stuck in flash flood

By

Published : Jul 28, 2023, 1:13 PM IST

Cars Stuck In Flood Water : కొద్ది రోజుల క్రితం దిల్లీని వరదలు వణికించాయి. యుమునా నది ఉగ్రరూపంతో దిల్లీ సహా సమీప ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కూరుకుపోయాయి. యమునా ఉపనది హిండన్‌ నదికి వరద ప్రవాహం భారీగా పెరగడం వల్ల ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని ఎకోటెక్ 3 సమీప ప్రాంతమంతా పూర్తిగా నీట మునిగింది. ఇదే ప్రాంతంలో ఉన్న ఓలా కంపెనీ డంప్ యార్డ్ సైతం పూర్తిగా నీటిలో కూరుకుపోయింది. తాజాగా హిండన్​ నదికి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో నీటిలో మునిగిపోయిన కార్లు ఇప్పడు కాస్త కనిపిస్తున్నాయి. పాత, రీపేర్ అయిన కార్లను ఓలా కంపెనీ ఎకోటెక్ 3 ప్రాంతంలో నిల్వ చేస్తోంది.

అంతకుముందు.. లోతట్టు ప్రాంతంలో కార్లు ఉన్నాయని గుర్తించి.. ఓలా కంపెనీని ముందే హెచ్చరించి రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయినా ఓలా స్పందించలేదని అన్నారు. పరిసర ప్రాంత గ్రామ ప్రజలను మాత్రం ముందస్తుగానే ఇళ్లు ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details