తెలంగాణ

telangana

Bandi Sanjay Fires on KCR and KTR

ETV Bharat / videos

బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్​, కేటీఆర్​ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్​ - BJP Leader Bandi Sanjay

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 3:49 PM IST

Bandi Sanjay Fires on KCR and KTR : బీఆర్​ఎస్​ నాయకులను కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తనకు అర్థం కావడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్​ఎస్​ నాయకులు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం, ఇప్పటికే విచారణ పూర్తి చేసి కేసీఆర్​తో పాటు కేటీఆర్​ను జైల్లో పెట్టే వారిమని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్​ తీగలగుట్టపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆరోబి వంతెనతో పాటు కరీంనగర్​ రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనులను బండి సంజయ్​ అధికారులతో కలిసి పరిశీలించారు.

Bandi Sanjay Inspect Karimnagar Railway Station : సేతు బంధు పథకంలో భాగంగా ఆరోబీ నిర్మాణ పనులు, అమృత్​ భారత్​ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్​ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్​ పేర్కొన్నారు. రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణ పనులను భూసేకరణ సాకుతో తాత్సారం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్​ రక్తం చిందించారని చెప్పుకోవడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్​ నియంతృత్వ పాలనను పారద్రోలడానికి బీజేపీ కార్యకర్తలు రక్తాన్ని చిందించారని నాటి విషయాలను బీజేపీ నేత బండి సంజయ్​ గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details