అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం : బండి సంజయ్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 5, 2023, 3:02 PM IST
Bandi Sanjay Fires on BRS and Congress :బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు బీసీలను అవమానిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలకు ఇరు పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో అధిక భాగం ఉన్న.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయరని ప్రశ్నించారు. బీసీ ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నిలదీయాలని కోరారు.
Bandi Sanjay Respond on Medigadda Barrage Report :రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మేడిగడ్డను పరిశీలించలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ల కుంగుబాటుపై.. జాతీయ డ్యాం సేఫ్టీ బృందం ఇచ్చిన నివేదిక తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. కాళేశ్వరంపై చర్చిండానికి.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నాని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేయకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మద్ధతిస్తామని ముస్లిం నేతలు రాహుల్ గాంధీకి చెప్పారన్నారు.