తెలంగాణ

telangana

ETV Bharat / videos

వ్యక్తిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు.. లైవ్​ వీడియో - ఔరంగాబాద్​ నేర వార్తలు

By

Published : Jun 3, 2022, 8:15 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ఓ వ్యక్తిని సజీవదహనం చేసేందుకు పెట్రోల్​ పోసి నిప్పంటించిన దారుణ సంఘటన మహారాష్ట్ర, ఔరంగాబాద్​ జిల్లాలో వెలుగు చూసింది. జల్నా గ్రామంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడి తుకారామ్​ మండల్​ అనే వ్యక్తిపై దేశ్​ముఖ్​ అనే వ్యక్తి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు మంటలు అర్పేసి ఔరంగాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఓ భూమికి సంబంధించిన వివాదమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడు సురాజ్​ దేశ్​ముఖ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details