తాగిన మైకంలో డెలివరీ బాయ్‌పై దాడి.. కిక్ బాక్సింగ్ తరహాలో.. - చైతన్యపురిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి
Attack on delivery boys: హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. వారిని ఆపడానికి మరో డెలివరీ బాయ్ వెళ్లగా.. అతడినీ విచక్షణారహితంగా కొట్టారు. నిందితుల్లో ఇద్దరు యువకులు ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాడి చేసి పారిపోతుండగా.. డెలివరీబాయ్స్ వారిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కిరణ్, ప్రవీణ్‌లను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే కారులో ఉన్న యువతి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST