యాపిల్ లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా, పండ్ల కోసం ఎగబడ్డ స్థానికులు - యాపిల్ ట్రక్కు
కశ్మీర్ నుంచి యాపిల్ లోడ్‌తో వస్తున్న ట్రక్కు బిహార్ ఔరంగాబాద్ జిల్లాలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరి.. యాపిల్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే.. 50కిపైగా బాక్సులను తీసుకెళ్లారు. పండ్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్న తనను స్థానికులు కొట్టారని ట్రక్కు డ్రైవర్ షెహజాద్ తెలిపారు. జిల్లాలోని మదన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కశ్మీర్ నుంచి ఒడిశాకు ఈ ట్రక్కు వెళ్తోంది. ఘటనలో డ్రైవర్, సహ-డ్రైవర్ క్షేమంగానే బయటపడ్డారు. పోలీసులు వచ్చి స్థానికులను చెదరగొట్టారు. ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST