Amit Shah: 'రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం' - తెలంగాణలో ముస్లీం రిజర్వేషన్లు
Amit Shah comments on Muslim reservation: తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రసంగించిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని పేర్కొన్న అమిత్ షా.. ప్రధాని సీటు ఖాళీగా లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదని జోస్యం చేశారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు.